కుష్టు నివారణే ధ్యేయంగా కృషి
కుష్టు నివారణకు కృషి చేయడం జరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రతి సంవత్సరం కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు చైతన్యవంతమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు.
– డాక్టర్ సురేంద్రబాబు,
జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్
అవగాహనతోనే చెక్
ప్రజలు కుష్టు వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలి. మురుగు లేకుండా చూసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరంపై గుండ్రటి, నల్లటి, తేనె రంగులో పెద్ద మచ్చలుంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఎవరికై నా కుష్టు ఉంటే ఆ ఇంట్లో ఉండే మిగిలిన వారికి రాకుండా పెప్ మాత్రలు మింగేలా చర్యలు తీసుకున్నాం. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జిల్లాలో స్పర్శ కార్యక్రమం చేపట్టాం. ప్రతి పీహెచ్‌సీ, స్కూలు, సచివాలయ పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయిలో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. రానున్న సంవత్సరాల్లో జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– డాక్టర్ ఖాదర్‌వలీ, జిల్లా టీబీ, కుష్టు, ఎయిడ్స్ నివారణ అధికారి
కుష్టు నివారణే ధ్యేయంగా కృషి


