ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● నెల్లూరులో పోలీస్ వార్షిక
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
● ప్రారంభించిన ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026ను శుక్రవారం ఎస్పీ అజిత వేజెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. జీవితంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మూడురోజులపాటు జరిగే స్పోర్ట్స్ మీట్‌లో రెట్టింపు ఉత్సాహంతో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. తొలిరోజు 100 మీటర్లు, 200, 400, 800 మీటర్ల పరుగు, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షాట్‌పుట్, డిస్క్‌త్రో, లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు కార్యాలయ మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఉల్లాసంగా.. ఉత్సాహంగా


