పరిశ్రమల్లో ప్రమాదాలపై సమాచారమివ్వండి
● కలెక్టర్ హిమాన్లు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): పరిశ్రమల నిర్వహణలో ఇబ్బందికర, ఏదైనా ప్రాణాంతకమైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమా ద కారణాలను తెలుసుకోవడంతో పాటు నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, కోస్ట్ గార్డులకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్‌లో చైర్మన్‌గా తాను, మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్ చంద్ తదితరులు పాల్గొన్నారు.


