సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
● డీఆర్వో విజయ్‌కుమార్
నెల్లూరు(దర్గామిట్ట): దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని డీఆర్వో విజయ్‌కుమార్ అన్నారు. జాతీయ మాజీ సైనికుల దినోత్సవాన్ని బుధవారం నెల్లూరులోని తిక్కన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 70 సంవత్సరాల వయసు దాటిన 30 మంది మాజీ సైనికులను డీఆర్వో శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.హరికృష్ణ, అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ వింగ్ కమాండర్ శ్యామ్‌ప్రసాద్, జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు కరేటి కళాధర్, ఉపాధ్యక్షుడు మేడేపల్లి రత్నయ్య, కావలి అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు తదితరులు పాల్గొన్నారు.


