అర్ధరాత్రి ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం ఏంటి? | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం ఏంటి?

Jan 22 2026 6:53 AM | Updated on Jan 22 2026 6:53 AM

అర్ధరాత్రి ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం ఏంటి?

అర్ధరాత్రి ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం ఏంటి?

ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు

రాపూరు: మండలంలోని రాపూరు మద్దెలమడుగు సెంటర్‌లో పైలాన్‌ ఉన్న స్తూపం వద్ద మంగళవారం అర్ధరాత్రి మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆ పార్టీ మండల కన్వీనర్‌ బొడ్డు మధుసూదన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి స్థానిక బాలాజీ కల్యాణ మండపం వద్ద బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009లో సోమశిల – స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ శంకుస్థాపనకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చి పైలాన్‌ను ఆవిష్కరించారన్నారు. ఇందుకు గుర్తుగా వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అప్పట్లో నేతలు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే వివిధ కారణాలతో ఆ విగ్రహ నిర్మాణం వాయిదా పడిందన్నారు. పైలాన్‌ ఉన్న స్థానంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టడం దారుణమన్నారు. మరోచోట పెట్టొచ్చు కదా అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని రాత్రికిరాత్రే పెట్టడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయపై జిల్లా నాయకులతో చర్చించి కలెక్టర్‌ దృష్టి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో తిరుపతి పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఖాదర్‌బాషా, రాష్ట్ర రైతు నాయకులు పిచ్చిరెడ్డి, కోటేశ్వరరెడ్డి, రాపూరు మండల ఉపాధ్యక్షుడు గౌస్‌పీర్‌, సెక్రటరీ డీవీ రమణయ్య, నాయకులు ఏటూరు మురళీమోహన్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement