జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు, పార్శిల్ కేంద్రాలు, ప్రముఖ దేవాలయాలు, జనసామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ఆదివారం పోలీసు అధికారులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకుని వారి గుర్తింపుకార్డులను పరిశీలించారు. లగేజీ బ్యాగ్‌లు, ఇతర వస్తువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నెల్లూరులో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌లు చిట్టెం కోటేశ్వరరావు, వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు


