వీఎస్‌యూలో పుస్తకావిష్కరణ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్ద గల విక్రమ సింహపురి యూనివర్శిటీలో శాంతి సమర్ పుస్తకాన్ని వీసీ అల్లం శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసిద్ధ తెలుగు రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం రాసిన పది ఉత్తమ కథలను డాక్టర్ ఐనాపురం రామలింగేశ్వరరావు హిందీలోకి శాంతి సమర్ పుస్తకంగా అనువందించడాన్ని అభినందించారు. అనంతరం బాల సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గానూ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న నెల్లూరు వాసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్‌ను సత్కరించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సునీత, పెన్నా రచయితల సంఘ అధ్యక్షులు గోవిందరాజు సుభద్రాదేవి, కవి ఇంద్రగంటి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


