ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో.. | - | Sakshi
Sakshi News home page

ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో..

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో..

ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో..

వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు సిటీ: ఓవైపు ఒంటరితనం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి మానసికంగా కుంగిపోయి బలనవ్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్‌ మండలంలోని కల్లూరుపల్లిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో దేవరకొండ శ్రీనివాసులు (54) నివాసం ఉంటున్నా డు. ఇటీవల అతని తల్లి మృతిచెందింది. శ్రీనివాసులుకు వివాహం కాకపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం తన ఇంటికి సమీపంలోని ఆటో స్టాండ్‌ వద్ద మద్యం తాగాడు. సమీపంలో మున్సిపల్‌ పార్కులో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement