పర్మిట్లు లేకున్నా.. | - | Sakshi
Sakshi News home page

పర్మిట్లు లేకున్నా..

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

పర్మిట్లు లేకున్నా..

పర్మిట్లు లేకున్నా..

పర్మిట్లు లేకున్నా సిలికాను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనధికార రీచ్‌లలో తవ్వకాలు చేసి ఇతర పర్మిట్లతో పంపిస్తున్నారు. ఇందులో కూడా వాహనానికి పది టన్నుల పర్మిట్‌ను తీసుకొని ఓవర్‌ లోడ్‌ దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు తరలిస్తున్నార. కేవలం ఆ పది టన్నులకే రాయల్టీని చెల్లిస్తున్నారు. 12 టైర్ల వాహనాలకు 25 టన్నులు.. 16 టైర్ల వాహనాల్లో 35 టన్నుల మేర రవాణా చేస్తున్నా.. అటు మైనింగ్‌ అధికారులు గానీ ఇటు రవాణాశాఖాధికారులు గానీ ఎక్కడా వీటిని తనిఖీ చేసిన పాపాన పోవడం లేదు. యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. ఆ వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని ఎవరూ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రధాన నేతలతో సంబంధాలు ఉన్న సంస్థ కావడంతో దోపిడీని అరికట్టే సాహసం ఎవరూ చేయలేరు. స్థానిక అధికార యంత్రాంగం, విజిలెన్స్‌, మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం అనధికార దోపిడీకి రక్షణగా నిలుస్తున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు సైతం చూస్తూ ఉండాల్సిందే. వారిచ్చే తాయిలాలు తీసుకొని మౌనం పాటించాల్సిందేనని ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement