సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌కు అవార్డు | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌కు అవార్డు

Feb 7 2026 9:34 AM | Updated on Feb 7 2026 9:34 AM

సైన్స

సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌కు అవార్డు

నెల్లూరు(టౌన్‌): జిల్లా సైన్స్‌ కేంద్రంలో క్యూరేటర్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఎన్‌.సుబ్రహ్మణ్యంకు జాతీయ స్థాయిలో శిక్షాగ్రహ లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఇన్‌ఓక్‌డ్‌ 5.0 మిషన్‌ టు మూవ్‌మెంట్‌ జాతీయ విద్యా సదస్సులో అవార్డును అందుకున్నారు. విద్యా కార్యక్రమాల విస్తరణ కోసం రూ.10 లక్షలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, గ్రామీణ విద్యాభివృద్ధికి చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేసిన ముగ్గురులో సుబ్రహ్మణ్యం ఒకరు. ఈ సందర్భంగా ఆయన్ను డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్షణ ఏపీసీ వెంకటసుబ్బయ్య అభినందించారు.

రైల్వే ఉద్యోగి

అనుమానాస్పద మృతి

కావలి రూరల్‌: రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కావలి రూరల్‌ రుద్రకోట గ్రామం ఎస్సీ కాలనీలో ఆర్‌.నాగరాజు (48) ఉంటున్నాడు. అతను రైల్వే గేట్‌మెన్‌గా అడవిరాజుపాళెంలో ఎల్‌సీ గేటు 160 వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా కుటుంబ సలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి 12 సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్య ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నాగరాజు ఇంటి ముందు శుక్రవారం ఉదయం ముగ్గువేయడానికి అతని పిన్ని వెళ్లింది. తలుపు తీసి చూడగా నాగరాజు మృతిచెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులతో కలిసి కావలి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆడుకుంటూ..

విషగుళికలు తిని..

అపస్మారక స్థితిలోకి చిన్నారి

వాకాడు: రొయ్య ల చెరువుల వద్ద కాపలా ఉంటు న్న కె.సురేంద్ర, గంగమ్మ దంపతుల కుమార్తె జయశ్రీ శుక్రవా రం ఆడుకుంటూ విషగుళికలు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం కొత్తగుంట సమీపంలో నాయుడుపేటకు చెందిన లోకేంద్ర అనే వ్యక్తికి రొయ్యల గుంతలున్నాయి. అక్కడ రేణిగుంట ప్రాంతానికి చెందిన సురేంద్ర, గంగమ్మ దాదాపు ఏడాది కాలంగా కాపలా ఉంటున్నారు. శుక్రవారం భార్యాభర్తలు తమ రెండేళ్ల వయసున్న కుమార్తెను పూరింట్లో వదిలి గుంతల వద్ద పనిచేస్తున్న చేస్తున్నారు. జయశ్రీ ఆడుకుంటూ అక్కడే ఉన్న విష గుళికలను తినింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని మోటార్‌బైక్‌పై వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గూడూరుకు తరలించారు. వాకాడు పోలీసులు వివరాలు నమోదు చేసి చిట్టమూరు పోలీసులకు అందజేసినట్లు తెలిసింది.

సైన్స్‌ సెంటర్‌  క్యూరేటర్‌కు అవార్డు
1
1/1

సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌కు అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement