మాటల్లో సాధికారత.. మారని బతుకుబాట | - | Sakshi
Sakshi News home page

మాటల్లో సాధికారత.. మారని బతుకుబాట

Mar 8 2026 7:22 AM | Updated on Mar 8 2026 7:22 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన వేదికలపైనే మహిళా సాధికారత కనిపిస్తోంది. వాస్తవంలో జీవన పోరాటం తప్పడం లేదు. సమాజంలో సగం.. అని సగర్వంగా చెప్పుకొనే అతివల జీవితాల్లో నిజమైన ప్రాధాన్యం అల్లంత దూరంలోనే ఉండిపోతోంది. వేదికలపై మహిళా సాధికారతపై గొప్ప మాటలు వినిపిస్తున్నా, నేలపై నిత్య జీవితం కూలీ పనులు, చిరు వ్యాపారాల్లోనే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఇంటి పనులతో ప్రారంభమయ్యే వీరి జీవన పోరాటం అర్ధరాత్రి వరకు అవిశ్రాంతంగా సాగుతోంది. గతంలో మహిళల ఆర్థిక బలానికి తోడుగా నిలిచిన పలు సంక్షేమ పథకాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే ప్రభుత్వం మారాక ఈ పథకాల గమ్యం మారిపోవడంతో అనేక కుటుంబాల్లో మళ్లీ పాత కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా మహిళల బతుకుబండి గమ్యంలో మార్పు కానరావడంలేదు. మహిళా సంక్షేమానికి బడ్జెట్లలో పెద్ద అంకెలు కనిపించినా, బతుకు బాటలో మాత్రం ఇంకా చిన్న ఆశలే ఆధారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూలదండలు, శుభాకాంక్షల కంటే మహిళల కష్టాలు, వేదనలు, వారి జీవన పోరాటమే ఈ ఫొటోలకు నిదర్శనంగా కనిపిస్తోంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement
 
Advertisement
Advertisement