అన్నదాతకు అగచాట్లు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అగచాట్లు

Mar 11 2026 7:26 AM | Updated on Mar 11 2026 7:26 AM

పెనుబల్లిలో రైస్‌మిల్లు ఎదుట ధర్నా

రూ.80 లక్షలు ఎగ్గొట్టిన వైనం

బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబు ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులకు పొంతన లేదు. అన్నదాతకు అండగా ఉంటాం.. ధాన్యం డబ్బులు త్వరగా జమ చేస్తామన్న కూటమి నేతల హామీలు నీటి మూటలయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి గ్రామంలో రైతులకు జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనం. కొల్లూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ ధాన్యాన్ని పెనుబల్లిలోని శ్రీరాజరాజేశ్వరి రా అండ్‌ బాయిల్డ్‌ రైస్‌మిల్లుకు తరలించారు. దాదాపు రూ.80 లక్షల విలువైన ధాన్యాన్ని అప్పగించి నెలలు గడుస్తున్నా, మిల్లర్లు మాత్రం నేటికీ నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. నగదు కోసం మిల్లు యజమానుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన బాధితులు మంగళవారం మిల్లు ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్‌ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బ్యాంక్‌ ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మకై ్క నట్టేట ముంచుతోందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement