● ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు
● నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. గురువారం కూడా ఆర్‌అండ్‌బీ, టౌన్ ప్లానింగ్ అధికారులను వెంట బెట్టుకుని మినీబైపాస్, మాగుంట లేఅవుట్, వనంతోపు సెంటర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. భవనాలను కొలతలు వేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు సీఐ వెంకటేష్, విజయ్‌కుమార్ పర్యవేక్షణలో రెండు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో 10 భవన నిర్మాణాలను పరిశీలించారు. వాటిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇప్పటికే కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు, అక్రమాస్తులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై నివేదికలు తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నారు. అనంతరం బాధ్యు లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది.


