ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు

Mar 13 2026 8:57 AM | Updated on Mar 13 2026 8:57 AM

రూ.5,43,649ల రికవరీకి ఆదేశం

సీతారామపురం: మండలంలోని 14 పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలను అధికారులు గుర్తించారు. రూ.5,43,649ల రికవరీకి ఆదేశించారు. సీతారామపురంలోని సీ్త్రశక్తి భవన ప్రాంగణంలో గురువారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై నెలరోజులుగా విచారణ చేపట్టిన డీఆర్పీలు నివేదికలను డ్వామా పీడీ గంగా భవాని ముందు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో సుమారు రూ.10 కోట్లతో పనులు జరిగాయన్నారు. వాటిలో రూ.6.65 కోట్లు కూలీలకు చెల్లించినవి కాగా రూ.2.90 కోట్లు ఇతర పనులకు వినియోగించారన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తప్పులు జరిగాయన్నారు. కొలతల్లో తేడాలున్న ప్రతి పనికి రికవరీ విధించామన్నారు. పలు పంచాయతీల్లో వంద రోజులు పూర్తయినా కూడా అదే కుటుంబానికి సింగిల్‌ జాబ్‌కార్డులను కొత్తగా తయారుచేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు కల్పించడం వంటివి గుర్తించామన్నారు. అలాంటి వాటికి కూడా రికవరీ రాశామన్నారు. ఎం బుక్‌ల్లో తేడాలకు టీఏ, ఈసీలు, మస్టర్లలో తేడాలకు ఏపీఓ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీవీఓ విజయలక్ష్మి, ఎస్సార్పీ భాస్కర్‌, డీఆర్పీలు నూతన్‌, నాగరాజు, మల్లికార్జున్‌, ఏపీఓలు శ్యామల, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement