విశిష్ట సేవలకు పురస్కారాలు
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో గతేడాదిలో విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అతి ఉత్కృష్ట, ఉత్కృష్ణ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాలకు ఎంపికై న వారి జాబితాను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా విడుదల చేశారు. జిల్లాకు చెందిన 13 మంది అతి ఉత్కృష్ట.. 23 మంది ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.
అతి ఉత్కృష్ట సేవా పతకానికి..
శ్రీనివాసులు, ఏఎస్సై, డీసీఆర్బీ.. వెంకటేశ్వరరావు, ఏఎస్సై, అల్లూరు.. జయంత్, పీసీ, బిట్రగుంట.. పూర్ణచంద్రబాబు, పీసీ, కావలి రూరల్.. వెంకటసుబ్బారావు, హెచ్‌సీ, ఏఆర్.. శిఖామణి, హెచ్‌సీ, సంగం.. సత్యనారాయణ, హెచ్‌సీ, ఆత్మకూరు.. ఆరిఫ్, హెచ్‌సీ, సంతపేట.. రమణయ్య, హెచ్‌సీ, ఏఆర్.. శ్రీనివాసులు, హెచ్‌సీ, చిన్నబజార్.. చౌడయ్య, హెచ్‌సీ, డీసీఆర్బీ.. మీరా, హెచ్‌సీ, ఏఆర్.. సుల్తాన్ మొహిద్దీన్, పీసీ, నవాబుపేట.
ఉత్కృష్ట సేవా పతకానికి..
భాస్కర్, హెచ్‌సీ, నవాబుపేట.. రమేష్‌బాబు, హెచ్‌సీ, మర్రిపాడు.. రమణయ్య, హెచ్‌సీ, సౌత్ ట్రాఫిక్.. చంద్రశేఖర్, హెచ్‌సీ, ఏఆర్.. శీనయ్య, హెచ్‌సీ, ఏఆర్.. చెంగయ్య, హెచ్‌సీ, ఏఆర్, భాస్కర్‌రావు, హెచ్‌సీ, ఏఆర్.. గోపాల్, హెచ్‌సీ, ఏఆర్.. మస్తాన్‌బాబు, పీసీ, డీసీఆర్బీ.. మాల్యాద్రి, పీసీ, ఏఆర్.. భవానీ, డబ్ల్యూపీసీ, ముత్తుకూరు.. అనూరాధ, డబ్ల్యూపీసీ, వేదాయపాళెం, మస్తానయ్య, ిపీసీ, ఏఆర్.. ఖాజాపీర్, పీసీ, వేదాయపాళెం.. సతీష్‌కుమార్, పీసీ, కోవూరు.. మహ్మద్ రఫీ, పీసీ, ఏఆర్.. నాగరాజు, పీసీ, నార్త్ ట్రాఫిక్.. శ్రీనివాసులు, హెచ్‌సీ, జలదంకి.. శ్యామ్‌ప్రసాద్, పీసీ, చిన్నబజార్.. మ హేష్‌కుమార్, హెచ్‌సీ, డీసీఆర్బీ.. శ్రీనివాసులు, హెచ్‌సీ, బుచ్చిరెడ్డిపాళెం.. శ్రీకాంత్, పీసీ, కావలి రూరల్.. జరీనా, డబ్ల్యూపీసీ, కావలి రూరల్.
జిల్లా వాసికి అతి ఉత్కృష్ట సేవా పతకం
అతి ఉత్కృష్ట సేవా పతకానికి జిల్లా వాసి, ఇన్‌చార్జి రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి వేలమూరి శ్రీరామ్ ఎంపికయ్యారు. సోమశిలకు చెందిన శ్రీరామ్.. ఎస్సైగా ప్రకాశం జిల్లాలోని దోర్నాల, మార్టూరు, కందుకూరు, చీరాల రూరల్, చీమకుర్తిలో.. సీఐగా పొదిలి, దర్శి, కందుకూరులో పనిచేశారు. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉంటూ ఇన్‌చార్జి రీజినల్ ఇంటెలిజెన్స్ (బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయనెన్నో సంచలన కేసులను ఛేదించారు.


