కదంతొక్కిన విద్యుత్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన విద్యుత్‌ కార్మికులు

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

కదంతొక్కిన విద్యుత్‌ కార్మికులు

కదంతొక్కిన విద్యుత్‌ కార్మికులు

తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాను విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్‌ మాట్లాడారు. దశాబ్దాల తరబడి సంస్థనే నమ్ముకొని పనిచేస్తున్న వారితో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు రూ.కోటితో బీమాను అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.పది లక్షలివ్వాలన్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పనిచేసిన షిఫ్ట్‌ ఆపరేటర్లు, వాచ్‌మెన్లకు రూ.27,953 మేర ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే విజయవాడ కేంద్రంగా ధర్నాను వచ్చే నెల 27న చేపట్టనున్నామని వెల్లడించారు. వివిధ సంఘాల నేతలు విజయరామిరెడ్డి, నాగరాజు, సునీల్‌, ఆరిఫ్‌, రాజమోహన్‌నాయుడు, ఆసిఫ్‌, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(దర్గామిట్ట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement