పింఛన్ల పంపిణీ నేడు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీ నేడు

Feb 28 2026 7:13 AM | Updated on Feb 28 2026 7:13 AM

పింఛన

పింఛన్ల పంపిణీ నేడు

నెల్లూరు(పొగతోట): లబ్ధిదారులకు పింఛన్లను శనివారం ఉదయం నుంచే పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మందికి సుమారు రూ.125 కోట్లను పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. అందుబాటులో లేని వారికి సోమవారం అందజేయనున్నామని చెప్పారు.

పాల కేంద్రాల్లో తనిఖీలు

సంగం: మండలంలోని పలు గ్రామాల్లో గల పాల కేంద్రాల్లో తనిఖీలను ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పాలు చిక్కగా కనిపించేలా ఇతర పదార్థాలను కలిపి కొందరు నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలను చేపట్టామని వివరించారు. ఎవరైనా కల్తీ చేశారనే సమాచారముంటే, తమకు తెలియజేయాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 62,074 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 27,784 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.21 కోట్లను సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో లభిస్తోంది. టైమ్‌ స్లాట్‌ టికెట్లు గల భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ధాన్యానికి

మద్దతు ధర కల్పించాలి

నెల్లూరులో భారీ ర్యాలీ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలో పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నగరంలో భారీ ర్యాలీని ఏపీ రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు సాగిన ర్యాలీని రైతు సంఘ జిల్లా నేత పొట్టేపాళెం చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వెంగయ్య మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది లక్షలెకరాల్లో వరిని పండిస్తున్నారని, దాదాపు 30 లక్షల పుట్ల ధాన్యం దిగుబడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పుట్టి ధాన్యానికి రూ.20,306 మేర ఇస్తున్నారని.. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల తరహాలో క్వింటాల్‌కు రూ.500ను అదనంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి అధికమై.. గిట్టుబాటు ధరల్లేక కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, నేతలు వెంకమరాజు, జనార్దన్‌, చండ్ర రాజగోపాల్‌, గోపాల్‌, ప్రసాద్‌, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ నేడు 1
1/3

పింఛన్ల పంపిణీ నేడు

పింఛన్ల పంపిణీ నేడు 2
2/3

పింఛన్ల పంపిణీ నేడు

పింఛన్ల పంపిణీ నేడు 3
3/3

పింఛన్ల పంపిణీ నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement