నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రామ్‌జీనగర్‌లో గల పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి 16 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. పార్టీని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయసాధనే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలనను గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందించారని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. రాబోయేది జగనన్న పాలనేనని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే అది జగన్‌మోహన్‌రెడ్డితోనేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.


