దేశ రాజకీయాల్లో ఓ చరిత్ర | - | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లో ఓ చరిత్ర

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

చిల్లకూరు: దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ పేర్కొన్నారు. గూడూరులోని సనత్‌నగర్‌లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్‌ను కట్‌ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీని జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దే అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పట్టణ, రూరల్‌ కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేంద్రరెడ్డి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, నందవరం సుబ్బారావు, మహిళా విభాగ నేతలు సృజనారెడ్డి, దీప్తి, షంషీర్‌, నేతలు వినోద్‌, సుభాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement