నెల్లూరు(పొగతోట): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని సివిల్ సప్లయ్స్ సంస్థ డీఎం అర్జున్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మద్దతు లేక రైతన్న రోదన’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఆదివారం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వరి కోతల ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇతర జిల్లాల ట్రేడర్లను ప్రోత్సహించకుండా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు.


