నెల్లూరు(బారకాసు): 120 మైక్రాన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. మంగళవారం ఎంహెచ్‌ఓ తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట, రేబాలవీధి, పప్పులవీధి ప్రాంతాల్లోని 14 ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు. ఆయా దుకాణాల యజమానులకు రూ.3.20 లక్షల జరిమానా విధించారు. మరోసారి నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో శానిటరీ సూపర్‌వైజర్లు మహబూబ్ షరీఫ్, ఆశీర్వాదం, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, జిలానీబాషా, అశోక్ పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖాధికారి
డాక్టర్ దినేష్
నెల్లూరులో దుకాణాలపై దాడులు


