‘ఉపాధి’లో అవినీతిపై చర్యలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో అవినీతిపై చర్యలకు డిమాండ్‌

Feb 28 2026 7:13 AM | Updated on Mar 1 2026 7:42 AM

‘ఉపాధి’లో అవినీతిపై చర్యలకు డిమాండ్‌

‘ఉపాధి’లో అవినీతిపై చర్యలకు డిమాండ్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిలో సంబంధం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయం రామకోటయ్య భవన్‌లో శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ వీబీ జీ రామ్‌జీ పథకాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందన్నారు. పేదలకు అందాల్సిన నగదును ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ సిబ్బంది కుమ్మకై ్క స్వాహా చేశారన్నారు. అలాగే వెలుగు పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి, వెలుగు పథకాల్లో జరిగిన అవినీతిపై మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు. సమావేశంలో నేతలు సీహెచ్‌ ప్రభాకర్‌రావు, లీలామోహన్‌, నందిపోగు రమణయ్య, మధు, సిరాజ్‌, శిరీష, వనజ, షాన్‌వాజ్‌, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement