హామీలు నెరవేర్చాలని అడగడం తప్పా? | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చాలని అడగడం తప్పా?

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

నెల్లూరు రూరల్‌: ‘అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం అణచివేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడం తప్పా’ అని కనిపించడం లేదా?’ అని వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీల విభాగం జిల్లా అధ్యక్షురాలు పి.లావణ్య ప్రశ్నించారు. గురువారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలు పి.లావణ్య, అలాగే రాష్ట్ర విభాగం సెక్రటరీ వెంకట జ్యోతి, ఇంకా రమీజా, రిజ్వానా, షాలిని, ముంతాజ్‌ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీలు హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులను పంపి, దాడులు చేసి శిబిరాన్ని ఎత్తివేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనమన్నారు. హామీలను నెరవేర్చాలని అడిగితే అర్ధరాత్రి పూట దాడులు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటం ఇంత వరకూ అంగన్‌వాడీలను చర్చలకు పిలవలేదన్నారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అటవాటేనన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఉద్యోగభద్రత కల్పించాలని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. అంగన్‌వాడీలకు అండగా వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement