100 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

100 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

గూడూరు రూరల్‌: రెండో పట్టణ సమీపంలో విందూరు మార్గంలో ఉన్న మధురెడ్డి కాలనీలో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేయడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి కథనం మేరకు.. చైన్నెకి అక్రమంగా రవాణా చేసేందుకు ఓ ఇంట్లో రేషన్‌ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో దాడులు చేసి 68 బస్తాలు, మినీ ట్రక్కులో ఉన్న 32 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్‌ సప్లయ్స్‌ గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామన్నారు. అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. స్థానికుల సమాచారంతో రేషన్‌ బియ్యా న్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. దాడుల్లో గూడూరు డీటీ చైతన్య, రూరల్‌ ఎస్సై తిరుపతయ్య, వీఆర్వోలు రవిచంద్ర, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement