ఆటోను ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన కారు

Mar 3 2026 7:24 AM | Updated on Mar 3 2026 7:24 AM

కావలి రూరల్‌: కావలి పట్టణ పరిధిలోని బుడమగుంట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వేగంగా వచ్చి కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి పల్టీకొట్టి ఎదురుగా వస్తున్న ట్రాలీ లారీపై పడింది. ఈ ఘనటలో ఆటో పూర్తిగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన పోట్లూరి చిన హజరత్తయ్య, ఆయన భార్య సుశీలమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమా దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం వారిని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు సిఫార్సు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ పరారైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement