కూటమి ప్రభుత్వానికి రూ.14 కోట్ల ముడుపులు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానికి రూ.14 కోట్ల ముడుపులు

Feb 28 2026 7:13 AM | Updated on Mar 1 2026 7:42 AM

కూటమి ప్రభుత్వానికి రూ.14 కోట్ల ముడుపులు

కూటమి ప్రభుత్వానికి రూ.14 కోట్ల ముడుపులు

కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

గూడూరు రూరల్‌: ‘హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సిలికా, ఇసుక అప్పగించారు. అతని నుంచి కూటమి ప్రభుత్వానికి నెలకు రూ.14 కోట్లు ముడుపులు అందుతున్నాయి’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు చింతా మోహన్‌ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బంధువుకు సిలికా ఇవ్వడం పెద్ద పొరపాటని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గూడూరు నియో జకవర్గాన్ని చంద్రబాబు బలహీనం చేశారని మండిపడ్డారు. నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి నాయకులను బలహీనం చేసే కుట్రలో భాగంగానే గూడూరు ను ముక్కలు చేశారన్నారు. దుగరాజపట్నం, మన్నవరం బెల్‌ ఫ్యాక్టరీ పను లు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సిలికా గనులను పేదలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామకృష్ణారావు, మీజూరు మాధవ్‌, శివ, అంకయ్య, వెంకటయ్య, శివశంకర్‌రాజు, రామచంద్రయ్య, దయాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement