పదోన్నతుల్లో ఏఎన్‌ఎంలకు తీవ్ర నష్టం | - | Sakshi
Sakshi News home page

పదోన్నతుల్లో ఏఎన్‌ఎంలకు తీవ్ర నష్టం

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

పదోన్నతుల్లో ఏఎన్‌ఎంలకు తీవ్ర నష్టం

పదోన్నతుల్లో ఏఎన్‌ఎంలకు తీవ్ర నష్టం

ఏపీ హంస అధ్యక్షుడు సుధాకర్‌రావు

నెల్లూరు(అర్బన్‌): వైద్యశాఖలో ఏఎన్‌ఎం లాంటి కొన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతుల్లో తీవ్ర నష్టం జరుగుతోందని, దీనిని తక్షణమే ప్రభుత్వం సరిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏపీ హంస) అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్‌ కిరణ్‌ డిమాండ్‌ చేశారు. నెల్లూరులో ఆదివారం ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌)లుగా ఉన్న ఏఎన్‌ఎంలకు 28 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవన్నారు. వారి సర్వీస్‌ మొత్తంలో ఎక్కువ మంది కనీసం ఒక ప్రమోషన్‌ కూడా తీసుకోకుండానే రిటైర్డ్‌ అయ్యారన్నారు. వైద్యశాఖలో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే వెళ్లి సేవలందించేది ఏఎన్‌ఎంలు మాత్రమేనన్నారు. ఈ నష్టాన్ని సరిచేసేందుకు ఏఎన్‌ఎంల కొత్త పోస్టులు మంజూరు చేసి వారికి పదోన్నతులు కల్పించాలన్నారు.

● ఏసీఎస్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న జంగా శ్రీనివాసులును ఏపీ హంస జిల్లా కార్యవర్గ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా గౌరవాధ్యక్షురాలు ఆర్‌.ఇందిర, సలహాదారు అరవ పరిమళ, ఉపాధ్యక్షురాలు నాగరాజమ్మ, ఇంకా మజార్‌, గౌస్‌బాషా, మంజరి, లక్ష్మీకాంతమ్మ, అరుణరాణి, వరలక్ష్మి, సోలా ఉమ, కామాక్షి, నాగయ్య, షీలా, అనితాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement