● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఇందుకూరుపేట: వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రభాకర్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొమరిక గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం గ్రామానికి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విచ్చేసి ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభాకర్‌రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, గండవరపు వసంతకుమార్‌రెడ్డి, కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, కార్యకర్తలు విచ్చేసి ప్రభాకర్‌రెడ్డికి నివాళులర్పించారు.


