తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ | - | Sakshi
Sakshi News home page

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

తలశిల

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

కోవూరు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ను మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల రఘురామ్‌ తండ్రి చంద్రశేఖర్‌రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో విజయవాడ గొల్లపూడిలోని రఘురామ్‌ నివాసానికి వెళ్లిన నల్లపరెడ్డి.. చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘురామ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రసన్న వెంట సీనియర్‌ నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి, పుత్తా శివశంకర్‌రెడ్డి ఉన్నారు.

ఆదాల పరామర్శ

అల్లూరు: కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ ఏటూరు భానుప్రకాష్‌రెడ్డిని నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. భానుప్రకాష్‌రెడ్డి తల్లి ఏటూరి విద్యావతమ్మ ఇటీవల మరణించారు. గురువారం అల్లూరు మండలం ఇందుపూరుకు మాజీ ఎంపీ వచ్చారు. విద్యావతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలో ఒకరి డిబార్‌

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం జరిగాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా 25,969 మందికి గానూ 25,417 మంది విద్యార్థులు హాజరయ్యారు. 552 మంది గైర్హాజరయ్యారు. బీవీనగర్‌లోని కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఇంటర్‌ అధికారులు డిబార్‌ చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని వీబీఆర్‌, శ్రీచైతన్య, నారాయణ జూనియర్‌ కళాశాలలను ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఆర్‌ఐఓ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించారు.

లారీని ఢీకొట్టిన కారు

ముగ్గురికి గాయాలు

దగదర్తి: మండల పరిధిలోని ఉలవపాళ్ల జాతీయ రహదారి పెట్రోలు బంక్‌ సమీపంలో గురువారం రాత్రి లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కావలి నుంచి చైన్నెకి ముగ్గురు కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. పెట్రోల్‌ బంక్‌ సమీపానికి రాగానే ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నెల్లూరు హాస్పిటల్‌కి తరలించినట్లు ఎస్సై జంపాని కుమార్‌ తెలిపారు.

నాలుగో

అంతస్తు నుంచి దూకి..

వృద్ధుడి బలవన్మరణం

నెల్లూరు సిటీ: ఓ వృద్ధుడు నాలుగో అంతస్తు భవనం నుంచి దూకి బలన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్‌ పరిధిలోని నారాయణ హాస్పిటల్‌కు సమీపంలో మహిళా పీజీలో బస్వ సురేంద్రరెడ్డి (70) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల నుంచి సురేంద్రరెడ్డికి బుధవారం ఫోన్‌ వచ్చింది. తన సోదరుడితో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సురేంద్రరెడ్డి గురువారం పీజీ భవనం నాలుగో అంతస్తు నుంచి దూ కాడు. స్థానికులు గుర్తించి వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ1
1/4

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ2
2/4

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ3
3/4

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ4
4/4

తలశిల రఘురామ్‌కు ప్రసన్న పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement