శోభాయమానంగా గిరిప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

శోభాయమానంగా గిరిప్రదక్షిణ

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

శోభాయ

శోభాయమానంగా గిరిప్రదక్షిణ

బిట్రగుంట: కొండబిట్రగుంటలోని బిలకూట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా గిరిప్రదక్షిణను శాస్త్రోక్తంగా గురువారం నిర్వహించారు. ప్రసస్నుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఆలయ అర్చకులు, వేదపండితులు జరిపారు. వేదపండితులు వేదనాదం చేస్తుండగా, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య సుముహూర్తంలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి, ఉభయదేవేరులతో కలిసి కొండ దిగి కిందికొచ్చారు. గోవిందనామస్మరణలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సాంస్కృతిక బృందాల కోలాటాల నడుమ కొండ చుట్టూ జరిపిన పరిక్రమణ ఆద్యంతం భక్తిపారవశ్యంతో సాగింది. ఆలయ ప్రధానార్చకుడు సత్యనారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై అసంతృప్తి

బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు అస్త్యవస్తంగా ఉండటంపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయానికి రంగులేయకపోవడం, నారద మండపంతో పాటు సమీపంలోనే ఏర్పాటు చేసిన కృష్ణుడి విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సైతం ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఆలయ ఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, ఉత్సవాలపై మీడియాకు కనీస సమాచారాన్ని ఇవ్వకపోవడం గమనార్హం. ఉత్సవాలను ఆలయాధికారులు సొంత కార్యాక్రమాల్లా ఇష్టారీతిన నిర్వహిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.

గిరి పరిక్రమణ

శోభాయమానంగా గిరిప్రదక్షిణ 1
1/1

శోభాయమానంగా గిరిప్రదక్షిణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement