పన్నులను నూరు శాతం వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పన్నులను నూరు శాతం వసూలు చేయాలి

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

పన్నులను నూరు శాతం వసూలు చేయాలి

పన్నులను నూరు శాతం వసూలు చేయాలి

పొదలకూరు: జిల్లాలోని పంచాయతీల్లో నూరు శాతం ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వసుమతి ఆదేశించారు. పొదలకూరులోని సచివాలయాల పరిధిలో ఇంటి పన్నుల వసూళ్ల తీరుపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం సమీక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి వసూలు చేయాలని చెప్పారు. పొదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

అనంతసాగరం

తహసీల్దార్‌ సస్పెన్షన్‌

నెల్లూరు(దర్గామిట్ట): మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అనంతసాగరం తహసీల్దార్‌ జయవర్ధన్‌పై సస్పెన్షన్‌ వేటేస్తూ ఉత్తర్వులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గురువారం జారీ చేశారు. అనంతసాగరం తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగిపై తహసీల్దార్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆత్మకూరు ఆర్డీఓకు ఈ నెల ఆరున ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ ఆరోపణలు వాస్తవమని నిర్ధారించారు. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు.

ఏపీఆర్‌సెట్‌లో చిట్టమూరు

వాసికి ప్రథమ ర్యాంక్‌

చిట్టమూరు: ఏపీఆర్‌ సెట్‌ ఫలితాల్లో సోషియాలజీలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ను మండలంలోని యాకసిరి పంచాయతీ గణ్ణంగిదిబ్బకు చెందిన హరిబాబు సాధించారు. ఎంఏ, ఎంఈడీ చేసి పల్లిపాడులోని డైట్‌ కళాశాలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.

బ్యాంక్‌

గ్యారెంటీలివ్వండి

నెల్లూరు (పొగతోట): ఽదాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎంపిక చేసిన రైస్‌మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలను తప్పక సమర్పించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. నగరంలోని పలు రైస్‌మిల్లులను గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారం నుంచి వరికోతలు ప్రారంభం కానున్నాయని, జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రైతులకు నష్టపోకుండా మద్దతు ధరను కల్పించేలా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. గోనె సంచులను సకాలంలో అందజేయాలని పేర్కొన్నారు. అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సివిల్‌ సప్లయ్స్‌ డీఎం అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement