నేత్రపర్వంగా తెప్పోత్సవం
వీక్షిస్తున్న భక్తులు
రంగనాయకులపేటలోని పవిత్ర పినాకినీ తీరం శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి తెప్పోత్సవంతో శుక్రవారం రాత్రి కళకళలాడింది. భక్తజన ఆనందోత్సాహాల నడుమ కనులపండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెన్నమ్మ ఒడిలో సర్వాలంకారశోభితంగా కొలువై విహరించారు. తొలుత పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెప్పలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చారు. మేయర్ దేవరకొండ సుజాత, ఏఎస్పీ దీక్ష, వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం అశ్వవాహనంపై స్వామివారు విహరించారు. – నెల్లూరు(బృందావనం)


