నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులను నూరు శాతం మేర ఈ నెల 15 నాటికి వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రూ.47 కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.27 కోట్లనే వసూలు చేశారని చెప్పారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, వీటిని ఈ నెల తొమ్మిదిన ప్రచురించాల్సి ఉందన్నారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నామని వివరించారు.


