నిరంతరం ప్రజాసేవలోనే.. | - | Sakshi
Sakshi News home page

నిరంతరం ప్రజాసేవలోనే..

Mar 13 2026 7:39 AM | Updated on Mar 13 2026 7:39 AM

వింజమూరు(ఉదయగిరి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పక్షమని, ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తూ వారి తరఫున పోరాటం చేస్తోందని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వింజమూరు మండలంలోని కాటేపల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించారని చెప్పారు. భవిష్యత్తు తమదేనని.. ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement