ప్లంబింగ్‌ పనులు చేస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

ప్లంబింగ్‌ పనులు చేస్తుండగా..

Mar 10 2026 1:25 PM | Updated on Mar 10 2026 1:25 PM

సన్‌షేడ్‌పై పడి ప్లంబర్‌ మృతి

నెల్లూరు(క్రైమ్‌): ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో తాడు సాయంతో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో సన్‌షేడ్‌పై పడి ప్లంబర్‌ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన ఎ.మధుసూదన్‌ (29) ప్లంబర్‌. భార్యాభర్తలు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ పనికి వెళ్తున్నాడు. సోమవారం అతను హరనాథపురం ఐదో వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పనికి వెళ్లారు. సహచరులు కరీమ్‌, అజయ్‌ తాడు పట్టుకోగా దాని సాయంతో మధుసూదన్‌ మూడో అంతస్తులో పనులు చేయసాగాడు. ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడంతో మధుసూదన్‌ ఒకటో అంతస్తు ఫ్లాట్స్‌ మధ్యనున్న సన్‌షేడ్‌పై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. సహచరులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని అపో లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మధుసూదన్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి లింగన్న బాలా జీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

పెన్నానదిలో మృతదేహం

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు కొత్త పెన్నాబ్రిడ్జి సమీపంలో సోమవారం నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు భగత్‌సింగ్‌ కాలనీ 54/4వ వార్డు వీఆర్వో తిరుమలరాజుకు సమాచారం అందించారు. ఆయన నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. తెలుపు, గోధుమ రంగు గళ్ల ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయి, ఉబ్చి జుట్టు ఊడిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుడు ఒంటిపై చొక్కా మాత్రమే ఉండటాన్ని బట్టి కాలకృత్యాల నిమిత్తం నదిలో దిగి ప్రమాదవశాత్తు మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement