ఇందుకూరుపేట: కొమరిక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రభాకర్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇటీవల ప్రభాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం కాకాణి కొమరికిలోని ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకుని కుటుం బసభ్యులను పరామర్శించారు. తొలుత ప్రభాకర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, నాయకులు మందల వెంకటశేషయ్య, షబ్బీర్, మహీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


