● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వాకాడు: ‘కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. త్వరలో మంచి రోజులు వస్తున్నాయి’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. అందుకు తగినట్టుగానే అధికారులు ప్రభుత్వానికి వంత పలుకుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతారన్నారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పండించిన ధాన్యానికి తగిన గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలవుతున్నారన్నారు. తమ పార్టీ అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జగనన్న పాలనలోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ముస్లింలు రామ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఆయన వెంట ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు దామోదర్‌రెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు ఏనుగు సుధాకర్‌నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, దేవారెడ్డి నాగూర్‌రెడ్డి, శేషురెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, నెల్లూరు పెంచలరెడ్డి, పాపారెడ్డి రాజశేఖరరెడ్డి, రాజారెడ్డి, మధురెడ్డి, శ్రీహరిరెడ్డి, జనార్దనరెడ్డి, సుధాకర్ నాయుడు, బాలకృష్ణయ్య, మధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


