ఉదయగిరి రూరల్: మండలంలోని వెంగళరావునగర్ సమీపంలో చిరుతపులి సంచరిస్తోందనే అంశంపై ఎఫ్బీఓ అఫ్జల్, ఏబీఓ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. వివరాలు.. దుత్తలూరు మండలం పాపంపల్లికి చెందిన వెంకటరమణ పనినిమిత్తం బైక్‌పై గండిపాళేనికి సోమవారం వెళ్లి, తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గండిపాళెం – వెంగళరావునగర్ మధ్య ఉన్న జామాయిల్ చెట్ల వద్ద చిరుతపులి రోడ్డు దాటుతుండడాన్ని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుర్తించారు భయభ్రాంతులకు గురైన ఆయన కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ఆపై విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆనవాళ్ల కోసం క్షుణ్ణంగా పరిశీలించగా, ఎలాంటి గుర్తులు లభించలేదు. మరోవైపు చిరుత సంచారంపై గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.


