మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం

మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం

నెల్లూరు(క్రైమ్‌): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహిళ సాధికారత వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో వాక్‌థాన్‌ ర్యాలీని ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య జెండా ఊపి ప్రారంభించారు. గివ్‌ టు గెయిన్‌ అనే నినాదంతో ర్యాలీ కేవీఆర్‌ కూడలి వరకు తిరిగి ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ వరకు సాగింది. కేవీఆర్‌ కూడలి వద్ద మహిళా పోలీస్‌లు, విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సమాజంలో మహిళలకు తగిన గుర్తింపు, ఆర్థిక స్వాలంబన లభిస్తాయన్నారు. ప్రతి మహిళ, యువతి తమ సెల్‌ఫోన్లలో శక్తియాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో యాప్‌ ద్వారా తక్షణ పోలీసు సాయం పొందవచ్చన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, బాల్య వివాహాలు, బాలకార్మిక నిరోధక చట్టాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిషేధం తదితరాలపై అవగాహన కార్యక్రమాలు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు, రక్తదాన శిబిరం, మెడికల్‌ క్యాంప్‌, ఓపెన్‌ హౌస్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌, ఏఆర్‌ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్‌.చంద్రమోహన్‌, దర్గామిట్ట, మహిళా పోలీస్‌స్టేషన్‌, కంట్రోల్‌రూమ్‌, ఎస్‌బీ, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌లు బి.కల్యాణరాజా, టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, శక్తి టీమ్‌ సభ్యులు, డీకేడబ్ల్యూ, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement