క్రీడా పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల్లో సత్తా

Mar 9 2026 7:18 AM | Updated on Mar 9 2026 7:18 AM

నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు మొదటిసారిగా ఆటల పోటీలను జెడ్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో శుక్ర, శనివారాల్లో ఏర్పాటు చేసిన పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు బహుమతులను చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు ఆదివారం అందజేశారు. జెడ్పీలో పనిచేస్తున్న అధిక శాతం మహిళా ఉద్యోగులు రెండు నుంచి మూడు బహుమతులను దక్కించుకున్నారు. అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన ఆఫీస్‌ సభార్డినేట్‌ సుమతి ఆరు బహుమతులను గెలుచుకున్నారు.

అలరించిన భరతనాట్య ప్రదర్శన

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయరాణి 61 ఏళ్ల వయస్సులో భరతనాట్యాన్ని ప్రదర్శించి అబ్బురపర్చారు. ఈమెకు బహుమతిని అరుణమ్మ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement