ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక

Mar 8 2026 7:22 AM | Updated on Mar 8 2026 7:22 AM

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర ఆర్చరీ పోటీలకు హాజరయ్యే జిల్లా జట్ల ఎంపికలను శనివారం నిర్వహించారు. నగరంలోని పొట్టేపాళెం మార్గంలో నవబాల దుర్గాదేవి ఆలయం వద్ద లిటిల్‌ ఏంజెల్స్‌ ఆర్చరీ అకాడమిలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలను క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లంరెడ్డి శ్రీహర్ష, కార్యదర్శి పావురాల వేణు ప్రకటించారు. మినీ అండర్‌–15 ఇండియన్‌ రౌండ్‌లో బాలురలో జి.మహేంద్ర, మోక్షితసాయి, డాత్విక్‌రెడ్డి, జి.హరిహర, జి.మోక్షిత్‌రెడ్డిలు, బాలికల విభాగంలో టి.ఆలయ, ఎం.కౌషికి లాస్య, ఎ.ప్రీతి, షఫియా సుల్తానా, యశస్విలు ఎంపికయ్యారు. అలాగే అండర్‌–15 రికర్వ్‌ రౌండ్‌లో బాలుర విభాగంలో సీహెచ్‌ అజయ్‌దేవ్‌, పి.కృష్ణేశ్వర కుమార్‌సింగ్‌, కె.చరిత్‌, బి.జిగ్నేష్‌, బాలికల విభాగంలో దిత్యా చండిక, డి.నిషితలు ఉన్నారు. మినీ అండర్‌–15 కాంపౌండ్‌ విభాగంలో ఎ.ఆస్రీత్‌, కె.జననీరెడ్డి ఎంపికయ్యారు. వీరు మార్చి 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్ర ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా తరఫున పాల్గొంటారు. లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌ కరెస్పాండెంట్‌ చాట్ల రాజేష్‌, కోచ్‌లు భరద్వాజ్‌రెడ్డి, పి.శంకర్‌, సాయికిరణ్‌, ఎం.హారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement