ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ అడుగులు
నెల్లూరు సిటీ: ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం సరికాదని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రావు, కార్యదర్శి నరస య్య అన్నారు. నెల్లూరులోని ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో మొదటి విడతగా 12 డిపోలను ప్రైవేటీకరించడం తగదన్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన జోనల్ అధ్యక్షుడిగా డి.రవికుమార్, కార్యదర్శిగా డి.బాబు శ్యాముల్, జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


