వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితా | - | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితా

Mar 2 2026 8:42 AM | Updated on Mar 2 2026 8:42 AM

వెబ్‌

వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితా

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను deonellore.50webs.comలో ఉంచామని డీఈఓ బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలను నగరంలోని డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఈ నెల ఏడులోపు సమర్పించాలని కోరారు.

ఉపాధి హామీ నూతన విధానాలపై అవగాహన

నెల్లూరు(పొగతోట): వీబీ – జీ – రామ్‌ జీ నూతన చట్టంపై ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని డ్వామా పీడీ గంగాభవానీ ఆదేశించారు. ఇందుకూరుపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. నూతన చట్టం మేరకు 125 రోజుల పనిదినాలను కల్పించాలని, దీనిపై అవగాహన నిమిత్తం గ్రామసభలను నిర్వహించాలని సూచించారు. ఆరు వారాల పాటు కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వీటిని జరపాలని ఆదేశించారు.

బాలసుబ్రహ్మణ్యం విగ్రహ

ప్రతిష్టకు భూమి పూజ

నెల్లూరు(బృందావనం): అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ పార్కులో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూమి పూజను ఆదివారం నిర్వహించారు. లాయర్‌ వారపత్రిక సంపాదకుడు తుంగా శివప్రభాత్‌రెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ఆత్మకూరు భానుమూర్తి, ప్రసాద్‌, గ్రోసు సుబ్బారావు, నలుబోలు బలరామయ్యనాయుడు, శేషగిరీశం, రియాజ్‌బాషా, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఇంజినీర్‌ చలపతి పాల్గొన్నారు.

కుక్కల దాడిలో దుప్పి మృతి

కోట: జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించి కరవడంతో మృతి చెందిన ఘటన మండలంలోని అల్లంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. నేలబావి వద్దకు ఏడు దుప్పిలు రాగా, అందులో ఒక దాన్ని కుక్కలు గాయపర్చాయి. గ్రామస్తులు రక్షించినా, కొద్దిసేపటికే మృతి చెందింది. అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చి.. వారికి అప్పగించారు.

4న ‘రంగడి’ రథం ట్రయల్‌ రన్‌

నెల్లూరు(బృందావనం): నగరంలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఈ నెల ఐదున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ను బుధవారం ఉదయం పదికి నిర్వహించనున్నామని ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు.

వెబ్‌సైట్‌లో  సీనియార్టీ జాబితా 
1
1/2

వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితా

వెబ్‌సైట్‌లో  సీనియార్టీ జాబితా 
2
2/2

వెబ్‌సైట్‌లో సీనియార్టీ జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement