అవినీతిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై చర్యలు తీసుకోవాలి

Mar 3 2026 7:24 AM | Updated on Mar 3 2026 7:24 AM

జిల్లాలో ఉపాధి హామీ పథకంలో, డీఆర్‌డీఏలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని జేసీకి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలామోహన్‌, నందిపోగు రమణయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో సైదాపురం, రాపూరు, కలువాయి, ఉదయగిరి మండలాల్లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాపూరు మండలంలో గిరిజనుల పేరుతో రూ.2.50 కోట్ల స్కామ్‌ జరిగిందని ప్రభుత్వ అధికారులు తేల్చినా రికవరీపై డీఆర్‌డీఏ జిల్లా అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. సొమ్మును రికవరీ చేయకపోతే భవిష్యత్‌లో డీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నేతలు యామాల మధు, సయ్యద్‌ సిరాజ్‌, సయ్యద్‌ షాన్‌వాజ్‌, సునీల్‌, సుమతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement