● హోంగార్డుకు గాయాలు
ఆత్మకూరు: ఓపెన్ ఇంటర్ పరీక్షల విధులకు హాజరై తిరిగి బైక్‌పై స్వగ్రామం వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్‌పై తరలిస్తున్న ఇనుప కమ్ములు హోంగార్డుకు తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం జరిగింది. బాధితుని వివరాల మేరకు.. అనంతసాగరం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే పి.ప్రసాద్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆత్మకూరులో ఓపెన్ ఇంటర్ పరీక్షల కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరీక్ష పూర్తయిన తర్వాత పేపర్లను సబ్మిట్ చేసి బైక్‌లో వెళ్తుండగా బస్టాండ్ వద్ద ఎదురుగా మరో మోటారు సైకిల్‌పై వస్తున్న వ్యక్తి పొడవాటి ఇనుప కమ్ములను అడ్డంగా పెట్టుకొని వస్తుండడంతో అవి తగిలి హోంగార్డు తొడపై లోతైన గాయమైంది. సమీపంలో ఉన్న వారు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై సాయిప్రసాద్, సిబ్బంది ఆస్పత్రి వద్ద హోంగార్డును పరామర్శించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


