విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పెద్దాస్పత్రి ఎమ్సీహెచ్ బ్లాక్‌లో మంటలు చెలరేగడంతో అక్కడి ఎన్‌ఐసీయూలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది పురిటి పిల్లలను కిమ్స్ స్పెషాల్టీ ఆస్పత్రికి అత్యవసరంగా ఆదివారం రాత్రి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యాన్ని డీఎంహెచ్‌ఓ సుజాత, ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కో ఆర్డినేటర్ సుధీర్‌కుమార్ సోమవారం పరిశీలించారు. మంచి వైద్యాన్ని అందించాలని ఆమె ఆదేశించారు. వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి చెల్లించనున్నామని తెలిపారు.


