● ట్యూషన్ నిర్వహిస్తూ.. డబ్బుల వసూలు
● బాడీ షేమింగ్ చేస్తూ..
● ప్రిన్సిపల్‌దీ అదే ధోరణి
● జేసీకి విద్యార్థి తల్లి ఫిర్యాదు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ఫతేఖాన్‌పేటలో గల రామయ్యబడి పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు, అక్రమాలపై విచారణ జరపాలంటూ జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు అక్కడ ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లి జ్యోతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానికులతో కలిసి వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. పాఠశాలలో సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు టీచర్ భవ్య ట్యూషన్ చెప్తూ, ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కంప్యూటర్, ప్రింటర్‌ను ఉపయోగించి ప్రింట్‌కు రూ.రెండు చొప్పున వసూలు చేస్తూ జిరాక్స్ షాపును అనధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ అంశమై డీఈఓకు గత నెల 27న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. విద్యార్థులను మరో టీచర్ మారుపేర్లతో పిలుస్తూ, ఆరోగ్య సమస్యలపై వెటకారం చేస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను తాను ప్రశ్నించడంతో మధు అనే టీచర్ బుధవారం చేయి చేసుకోబోయారని తెలిపారు. 112కు కాల్ చేసి పోలీసులను పిలవడంతో గొడవ సద్దుమణిగిందన్నారు. పాఠశాలలో టాయ్‌లెట్ల నిర్వహణ, సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని ప్రశ్నిస్తే, తమ స్కూల్ ఇంతే.. లేదంటే టీసీ తీసుకెళ్లాలంటూ ప్రిన్సిపల్ రమేష్‌బాబు బెదిరిస్తున్నారని చెప్పారు. వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.


