కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 11 2026 7:26 AM | Updated on Mar 11 2026 7:26 AM

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని 12 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కేజీబీవీల్లో ఆరో తరగతికి 40.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లున్నాయని చెప్పారు. అదే విధంగా ఏడు నుంచి పదో తరగతి వరకు.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరాల్లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు మాత్రమే అర్హులని, దరఖాస్తులను apkgbv.apcfss.in ద్వారా వచ్చే నెల ఒకటిలోపు పొందొచ్చని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన వాటినే పరిగణించనున్నామని, ఎంపికై న విద్యార్థుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందన్నారు. సందేహాల కోసం సమీపంలోని కేజీబీవీ ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని సూచించారు.

నర్రవాడలో

వేలం పాటలు

దుత్తలూరు: మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో వివిధ హక్కులు పొందేందుకు సంబంధించిన బహిరంగ వేలం పాటలను దేవదాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించారు. పూజా ద్రవ్యాలు విక్రయించుకునే హక్కును రూ.30.2 లక్షలకు.. అమ్మవారికి సమర్పించే చీరలు, జాకెట్లను సేకరించే హక్కును రూ.8.2 లక్షలకు శివలీల దక్కించుకున్నారు. పొంగలి షెడ్డుకు సంబంధించి పొంగలి సామగ్రిని విక్రయించే హక్కును రూ.1.36 లక్షలకు సుశీలమ్మ.. పుష్పాలు, పూలమాలలను సరఫరా చేసే హక్కును రూ.5.15 లక్షలకు పత్తి సుబ్రహ్మణ్యం.. పాదరక్షలు భద్రపర్చుకునే హక్కును రూ.22 వేలకు జయరాజ్‌ దక్కించుకున్నారు. ఇన్‌చార్జి ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త వేమూరు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీలో

ఉత్తమ భద్రత ప్రమాణాలు

తోటపల్లిగూడూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ కంపెనీలో ఉత్తమ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఈశ్వర్‌చంద్‌ పేర్కొన్నారు. ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌లో జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగళవారం ఆయన హాజరయ్యారు. ప్రపంచ స్థాయి భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని ప్రశంసించారు. వివిధ భద్రత పోటీల్లో విజేతలకు అవార్డులు, బహుమతులను అందజేశారు. సంస్థలో భద్రత అవగాహన, పద్ధతులను ప్రోత్సహించడంలో కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. సీఈఓ జన్మేజయ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 72,526 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,664 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement