గూడూరు ఆర్డీఓగా సత్యనారాయణ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

గూడూరు ఆర్డీఓగా సత్యనారాయణ బాధ్యతలు

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

చిల్లకూరు: గూడూరు ఆర్డీఓగా జీవీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సబ్‌కలెక్టర్‌ రాఘవేంద్ర మీన ఆరు నెలల క్రితం బదిలీపై ఢిల్లీ వెళ్లారు. అప్పట్నుంచి నెల్లూరు ఆర్డీఓ నాగసంతోష అనూషా ఇన్‌చార్జి ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామాయపట్నం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న జీవీవీ సత్యనారాయణను పూర్తిస్థాయి బాధ్యతలతో ఆర్డీఓగా నియమించారు.

ఇద్దరికి కారుణ్య

నియామకాలు

నెల్లూరు(అర్బన్‌): ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ మృతి చెందిన ఇద్దరి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సోమవారం కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కలెక్టరేట్‌లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. సూరాయపాళెం పీహెచ్‌సీలో ఎంఎన్‌ఓగా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వెంకటయ్య కుమారుడు ఆనంద్‌కుమార్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌/కంప్యూటర్‌ అసిస్టెంట్‌గా, డక్కిలి పీహెచ్‌సీలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన రమేష్‌కుమారుడు నితిన్‌తేజను వ్యవసాయశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.

శ్రీవారి దర్శనానికి

12 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,879 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటలు పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement