ములుమూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏటా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సారి ఇలా చేయకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని సోమవారం అందజేశా. పాత ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రెవెన్యూ, సొసైటీ సభ్యులు మరుసటి రోజొచ్చి ఫొటోలు తీసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందంటూ సంతకాలు చేయాలని చెప్పారు. అయితే సాల్వ్ కాకపోతే చేయనని చెప్పా. ఇది జరిగిన మూడు గంటల్లో సమస్యను పరిష్కరించామంటూ నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – శ్రీనివాసులు, రైతు, ఫిర్యాదుదారుడు
●


